KKR vs LSG: హైస్కోర్ మ్యాచ్‌లో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. అసలు ఏం మ్యాచ్‌రా నాయన.. 7 d ago

IPL 2025 భాగంగా మంగళవారం జరిగిన డబల్-హెడ్డారు మ్యాచ్‌లలో కోల్‌కతా లైట్ రైడర్స్ (KKR) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి ఓవర్ వరుకు మహా ఉత్కంఠభరితంగా సాగింది. ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల వర్షం కురిసింది. LSG బ్యాటర్లు ఈడెన్‌లో చెలరేగిపోయారు..సిక్స్‌లు, ఫోర్లతో.. కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
కోల్‌కతా కూడా మ్యాచ్‌ని చివరి ఓవర్ వరుకు తెచ్చింది. కానీ చివరికి ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్నో జట్టు కోల్‌కతాపై 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానానికి చేరుకోగా KKR ఐదవ స్థానంలో నిలిచింది. బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన నికోలస్ పూరన్ మన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
తోలుత టాస్ గెలిచి కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కు దిగిన లక్నో ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. లక్నో జట్టును బ్యాటింగ్‌కు అహ్వానించడం.. తప్పని తెలుసుకోవడానికి రహానేకు ఎంతో టైమ్ పట్టలేదు. మొదటి బంతి నుండే హిట్టింగ్ చేయండం ప్రారంభించారు.
అయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్‌లు విరుచుకుపడడంతో లక్నో జట్టుకు మంచి స్టార్ట్ అందింది. కెప్టెన్ అజింక్య రహానే.. వికెట్ తీసేందుకు సహవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి హర్షిత్ రానా.. మార్క్రమ్ను బౌల్డ్ చేశాడు. 28 బంతుల్లో 47 రన్స్ చేసిన మార్క్రమ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇక క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
సిక్స్‌లు, ఫోర్లతో.. KKR బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ దెబ్బతో పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కోల్‌కతా పరిస్థితి. నికోలస్ పూరన్ 36 బంతుల్లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లుతో.. 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 241 స్ట్రైక్ రేట్‌తో పూరన్ బీభత్సం సృష్టించాడు. మరోవైపు మిచెల్ మార్ష్ కూడా.. 48 బంతుల్లో 81 రన్స్ చేసి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ జోడి సూపర్ బ్యాటింగ్ తో లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. KKR బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రసెల్ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాటర్లు జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ఓపెనర్ డికాక్ (15) త్వరగానే ఔట్ అయినా.. కెప్టెన్ అజింక్య రహానే (35 బంతుల్లో 61 రన్స్) ఎదురుదాడికి దిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 90 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసిన వెంటనే ఓపెనర్ సునీల్ నరైన్ (13 బంతుల్లో 30 రన్స్) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45 రన్స్) రహానేతో కలిసి వీర బాదుడు బాదాడు.
ఒక దశలో 14 ఓవర్లలో 166 పరుగులు చేసి విజయం వైపు పయనిస్తున్నట్లు కనిపించిన కోల్‌కతా.. చివరి ఓవర్లలో ట్రాక్ తప్పింది. వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ చెయ్ జారిపోయింది. వీరి తరువాత వచ్చిన రమణ్‌దీప్ సింగ్ (1), రఘువంశీ (5), ఆండ్రీ రసెల్ (7) విఫలమయ్యారు. రింకూ సింగ్ ఒక్కడే చివరి వరుకు పోరాడాడు.. 15 బంతుల్లో 38* రన్స్ చేసిన కూడా జట్టును ఓటమి నుండి కాపాడలేక పోయాడు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులను మాత్రమే చేరుకోగలిగింది.